
'శ్రీరెడ్డి' ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదేమో. మాములుగా అయితే శ్రీరెడ్డి ఎవరో ఎవరికి తెలీదు. కానీ ఆమె చేసిన నిరసనలు, సెలెబ్రెటీలపై చేసిన ఆరోపణలు, ఫిల్మ్ ఛాంబర్ ముందు చేసిన రచ్చ కారణంగా ఇప్పుడు ఇమే అందరికి సూపరిచితురాలైంది. కొన్ని రోజుల పాటు మీడియాలో ఇమేనే హాట్ టాపిక్ గా నిలిచింది. ఆ తర్వాత కొంత సైలెంట్ అయ్యి...అప్పుడప్పుడు నేను ఉన్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. ఇక తాజాగా ఆమె అందాలతో మరోసారి హాట్ టాపిక్ అయింది. రైతుల కోసం నిధులు సేకరించేందుకు ప్రవోలియన్ అనే సంస్థ చెన్నైలో ఫ్యాషన్ షోను నిర్వహించింది. ఈ షోలో తనలో గ్లామర్ కంటెంట్ కూడా టన్నుల కొద్ది ఉందని నిరూపించింది. రిను అనుకుంల్ డిసైన్ చేసిన దుస్తుల్లో తన అందాలను చూపిస్తూ ర్యాంప్ పై హొయలు పోయింది. శ్రీరెడ్డిలో ఈ యాంగిల్ చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు.