
అక్కినేని ఫ్యామిలీ నుంచి వారసుడు అఖిల్ సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా లేదు. అఖిల్ నటించిన తాజా సినిమా మిస్టర్ మజ్ను కూడా అంతంతమాత్రంగానే ఆడింది. దీంతో తదుపరి సినిమాకు చాలా గ్యాప్ తీసుకొని సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇదిలావుండగా ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా లేకపోవడంతో హిట్ సినిమాలు ఇచ్చిన డైరెక్టర్లు అయితే తన కెరియర్ కు మంచిదని భావించిన నాగార్జున...అఖిల్ ను ఆ దిశగా డైరెక్ట్ చేస్తున్నాడు. విశాల్ హీరోగా వచ్చిన "అభిమన్యుడు" మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను డైరెక్ట్ చేసిన పీఎస్ మిత్రన్ కు క్రేజ్ తెచ్చిపెట్టింది. అందుకనే అఖిల్ ఆ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడట. ఆయన తాజా చిత్రం ‘హీరో’ సెట్ కు వెళ్లి కలిసాడు అఖిల్. అప్పుడు ఒక లైన్ చెప్పిన మిత్రన్ ఆ తర్వాత మీటింగ్ లో డిటైల్డ్ గా చెప్పారని తెలుస్తోంది. ఇది విన్న నాగార్జున తెలుగులో చాలా కొత్త కధాంశం అని ఫీల్ అయ్యి...గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక దీన్ని సెట్స్ పైకి తీసుకెళ్తారని టాక్.