
టాలీవుడ్ లో ఫీమేల్ యాంకర్ల హవా బాగా ఎక్కువ. ఇక మరి ముఖ్యంగా సుమాకి బుల్లితెరపై తిరుగు లేదు. అంత పోటీ ఉన్న రంగంలోకి వచ్చి తన సత్తా చాటి...వచ్చిన రోజు నుండి నేటి వరకు గ్యాప్ లేకుండా షోలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నాడు యాంకర్ ప్రదీప్. ఫీమేల్ డామినేటింగ్ రంగంలోకి వచ్చి ఇంత పాపులారిటీ,క్రేజ్ సంపాదించడం మాములు విషయం కాదు. ప్రదీప్ పాపులర్ షోలు అయిన డీ,కొంచెం టచ్ లో ఉంటే చెప్తా లాంటి షోలో యాంకరింగ్ చేస్తూ అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ప్రదీప్ కనపడడం లేదు. స్టేజ్ పై ప్రదీప్ ను చూసి నెల రోజులు కావోస్తుంది. దీంతో పుకార్లు జోరుగా పుట్టుకొచ్చాయి. ప్రదీప్ తీవ్ర అనారోగ్యంతో బాధపడ్తున్నాడాని, సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నాడని..ఇలా రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే పుకార్లు పక్కన పెడితే...ప్రదీప్ కు షూటింగ్ లో భాగంగా కాలికి దెబ్బ తగిలిందని....డాక్టర్లు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో ప్రదీప్ కోలుకుని తిరిగి బుల్లి తెరపై యాంకర్ గా బిజీ అవుతాడని అంటున్నారు.