
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైది ఆయన కెరీర్ లొనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ పవర్ ప్యాక్డ్ సినిమాల్లో ఖైదీ ఖచ్చితంగా ఉంటుంది. అది అలా ఉంచితే... కోలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉన్న హీరోల్లో కార్తీ ఒకరు. కార్తీ హీరోగా నటించిన సినిమాకి మినిమమ్ వసూళ్లు గ్యారెంటీ అని నమ్ముతారు దర్శకనిర్మాతలు. కేవలం కోలీవుడ్ లోనే కాకా టాలీవుడ్లో సైతం తన మార్కెట్ ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. అందుకే తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు తనకు బాషా రాకపోయినా నేర్చుకోని డబ్బింగ్ చెప్తున్నాడు. కార్తీ నటించిన తాజా చిత్రం ఖైదీ కోలీవుడ్లో 100కోట్ల వసూళ్లను అందుకుంది. ఖైదీ 13కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్లొనే కాక టాలీవుడ్లో కూడా ఖైదీకు మంచి స్పందన లభించింది. కార్తీ యాక్టింగ్ కు సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. హీరోయిన్ లేకుండా, పాటలు లేకుండా థ్రిల్లర్ నేపధ్యంలో వచ్చిన ఖైదీ కార్తీ కెరీర్ బిగ్గెస్ట్ హిట్. అప్పుడు మెగాస్టార్ ఇప్పుడు కార్తీ అదే టైటిల్ తో హిట్ కొట్టడం విశేషం.