
బుల్లితెర యాంకర్ శ్రీముఖి తన అందచందాలతో, కేకలతో ఈటీవీ ప్లస్ లో ప్రసారమవుతున్న పటాస్ షోలో రాములమ్మగా ఫుల్ పాపులర్ అయింది. ఆమె మీద డిపేండ్ అయ్యే షో నడిచేది. అయితే ఆ పటాస్ షో కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చి వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాల్టీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా శ్రీముఖి పాల్గొన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. 3నెలలుగా ఆమె అల్లరితో, నవ్వులతో, టాస్క్‌లతో అలరించింది. ఈ షో ద్వారా ఆమెకు మరింత ఫ్యాన్ బేస్ పెరిగింది. బిగ్ బాస్ సీజన్ 3 రన్నరప్ గా నిలిచిన శ్రీముఖి షో ముగిసాక ఫ్రెండ్స్ తో కలిసి మాల్దీవ్స్ కు వెళ్లొచ్చింది. ఇక ఆమె రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. అతి త్వరలోనే మళ్లి తెరపై కనిపిస్తానని, స్టార్ మాలో అదిరిపోయే ప్రోగ్రామ్ చేస్తున్నాని ఓ వీడియో ద్వారా తెలిపింది. ఆ షో ఏంటి? ఎలాంటిది? అనే వివరాలు తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.