
ఎసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా భారీ మెజారిటీతో విజయం సాధించింది. ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి జగన్ సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. జగన్ ను నమ్ముకుని పార్టీలోకి వచ్చిన వాళ్లకు తగ్గ పదవులను ఇస్తున్నారు. తాజాగా నందమూరి లక్ష్మీ పార్వతిని తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా నియమించారు. అలానే నటుడు అలీకి తాను ఎదురుచూస్తున్న పదవి ఇస్తారని భావించారు. కానీ అలీకు ఈ విషయంలో నిరాశే మిగిలింది. తాను ఆశపడ్డ ఏపీ ఫిల్మ్ చాంబర్ డెవలెప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా సినీనటుడు విజయ్ చందర్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలీ ఎంతగానో ఆశపడ్డ ఈ పదవికి అనూహ్యంగా విజయ్ చందర్ ను నియమించి షాక్ ఇచ్చారు. విజయ్ చందర్ కు వైకాపాలో కీలక పదవి దక్కడం ఇప్పుడు సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.