
మెగా ఫ్యామిలి నుంచి ఎంతోమంది వారసులు వచ్చారు. చిరు వేసిన దారిలో చాలా సులువుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. అలా వచ్చిన వారిలో లేటెస్ట్ అంటే చిరు చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్. కళ్యాణ్ దేవ్ చేసిన మొదటి సినిమా "విజేత" సినీ విమర్శకుల ప్రశంసలైతే దక్కించుకుంది కానీ బాక్స్ ఆఫీసు వద్ద వసూళ్లు సాధించలేకపోయింది. అయితే కళ్యాణ్ దేవ్ తన రెండో సినిమా "సూపర్ మచ్చి" మొదలుపెట్టి చాలా కాలమైంది కానీ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ రాలేదు. అయితే కళ్యాణ్ ఎలాగైనా నిలబెట్టాలని ఫిక్స్ అయిన చిరు తన రెండో సినిమా ఆగిపోయే ప్రమాదాన్ని తప్పించారట. సూపర్ మచ్చి నిర్మాత డబ్బులు లేవంటూ సినిమాను మధ్యలోనే ఆపేసే సమయానికి చిరు రంగంలోకి దిగి సినిమా పూర్తి కావడానికి కావాల్సిన డబ్బును తనే సమకూర్చారని తెలుస్తోంది. మరి ఇప్పటికైనా సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని త్వరగా విడుదల చేస్తుందేమో చూడాలి.