
అల్లు అర్జున్ సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చాడు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత సుమారు ఏడాదికి పైగా గ్యాప్ ఇచ్చిన బన్నీ... ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "అల...వైకుంఠపురంలో" సినిమాతో రాబోతున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టారు. ఈనేపథ్యంలో ఇప్పటికే టీజర్ తో సహా రెండు పాటలను విడుదల చేసింది చిత్ర యూనిట్. తాజాగా ఓఎంజి డాడీ అనే పాటను నేడు చిల్డ్రెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నామని చెప్పిన టీం..ఫ్యాన్స్ కు రెండు సర్ప్రైజ్లు ఉన్నాయని తెలిపింది. చిల్డ్రెన్స్ డే కాబట్టి ఆ రెండు సర్ప్రైజ్లు అల్లు అర్జున్ కూతురు అర్హ, కొడుకు ఆర్యన్ అయ్యి ఉంటారని అంచనా వేస్తున్నారు. రిలీజ్ చేయబోయే పాటలో ఈ బుడతలిద్దరూ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలు దుమ్మురేపుతున్నాయి... ఇక ఈ పాట ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.