
అల్లు అర్జున్ సినిమా అంటేనే యువతలో వుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అల్లు అర్జున్ తాజాగా అలా వైకుంఠపురంలో చిత్రం లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలోని ఒక పాటని చిత్ర బృందం విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పాట యువతని ఉర్రుతలూగిస్తుంది. ఈ పాటకు అత్యధిక లైక్స్ రావడం, అల్లు అర్జున్ ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలపడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ స్టామినా అంటే ఇది అని ఈ ఒక్క రికార్డు చాలు అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.