
అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత మరే సినిమాలో నటించలేదు. ఏడాదికి పైగే గ్యాప్ వచ్చింది. అందుకే ఈ గ్యాప్ ను భర్తీ చేయడానికి వరసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో 'అల..వైకుంఠపురంలో' అనే సినిమా తీస్తున్నాడు. ఇది పూర్తి కాగానే సుకుమార్ తో సినిమా చేయనున్నాడు. అయితే త్రివిక్రమ్ సినిమా ఓకే చేయకముందు.. హిందీలో మంచి విజయం సాధించిన 'సోను కే టిటు కి స్వీటీ' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని భావించి కసరత్తులు కూడా మొదలుపెట్టాడు. కానీ ఈలోపు త్రివిక్రమ్ మంచి కథతో రావటం వల్ల దాన్ని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ఆ రీమేక్ దగ్గుబాటి చేతుల్లోకి వెళ్లిందని టాక్. ఇందులో మరో హీరో కూడా ఉంటాడు. ఇటీవల యంగ్ హీరో విశ్వక్ సేన్ రానాని కలిశాడు. దీనితో ఈ చిత్రంలో సెకండ్ హీరో విశ్వక్ సేన్ అనే ప్రచారం జరుగుతుంది. ఇక ప్రస్తుతం రానా 'విరాట పర్వం' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం నక్సెల్స్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది.