
బాహుబలి లాంటి ఇంటర్నేషనల్ స్థాయి సినిమా తీసి తెలుగు చలన చిత్రం గర్వపడేలా చేసిన రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ బడా స్టార్లు అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కోమరం బీమ్ జీవిత చరిత్ర ఆధారంగా ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కోమరం బీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఎన్టీఆర్ సరసన ఒలివియా, చరణ్ సరసన అలియా భట్ నటుస్తున్నారు. ఈ చిత్రం మొదలుపెట్టిన రోజు నుంచి వచ్చే ఏడాది జులై30న రిలీజ్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు. కానీ అది సాధ్యపడేలా లేదు. తాజాగా మత్తు వదలరా సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన రాజమౌళిని ఆర్ఆర్ఆర్ రిలీజ్ గురించి అడిగితే "మత్తు వదలరా సినిమాకే సంవత్సరం పట్టింది. దయచేసి నన్ను ఆర్ఆర్ఆర్ రిలీజ్ గురించి అడగదు" అని చెప్పారు. దీంతో మరి ఈ సినిమా దసరా కానుకగా వస్తుందా లేదా ఆగస్టు 15న వస్తుందా చూడాలి.