
ఇటీవలే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన తదుపరి చిత్రం 'పవర్ స్టార్' పేరుతో రావడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. ఇప్పుడు ఈ కాంట్రవర్షియల్ డైరెక్టర్ చిత్రీకరణను ప్రారంభించినట్లు తెలుస్తుంది మరియు ఈ చిత్రాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 02న విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విడుదలకు ఇంకా చాలా సమయం మిగిలి ఉండటంతో ఆర్జీవీ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నట్లు అర్ధం అవుతుంది. పవర్ స్టార్ ను టార్గెట్ చేస్తే, దానికి పవన్ స్పందిస్తే తనకున్న క్రేజ్ ను వాడుకొవచ్చని ఆర్జీవీ ప్లాన్. అయితే, తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఆర్జీవీ విడుదల చేసిన అన్ని స్టిల్స్‌ను చూసి నవ్వి ఉరుకున్నారట. ఆర్జీవీకి స్పందించకూడదని, చీప్ ప్రచారం చేయడానికి అవకాశం ఇవ్వకూడదని పవన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.