
సూపర్ స్టార్ మహేష్ నటించిన తాజా చిత్రం 'మహర్షి' బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాలో నటిస్తున్నాడు. చాలా కాలానికి మహేష్ కామెడీ యాంగిల్ ను చూపించబోతున్నారు అనిల్. ఈ సినిమా ఇప్పటికే 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో సినిమా నడుస్తుందని పోస్టర్స్ చూస్తే అర్ధం అవుతుంది. అయితే దీనికోసం కొంతభాగం కాశ్మీర్ లో షూట్ చేసిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ లో షూటింగ్ జరుపుతున్న సమయంలో కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ పట్టిష్టమైన భద్రత కలిపించారని తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనిల్ చెప్పడం జరిగింది. అంతే కాదు, మహేష్ కు బులెట్ ప్రూఫ్ జాకెట్ కు ఇచ్చారట. షూటింగ్ కోసం ఇంత భద్రత ఎందుకని తమకు అప్పుడు అర్ధం కాలేదని...ఆ తర్వాత కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు గురించి తెలిసిందని చెప్పుకొచ్చారు.ఇక ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవనుంది.