
ఆర్టీసీ కార్మికులు స్ట్రైక్ మొదలుపెట్టి నెల రోజులు దాటేసింది. తమ డిమాండ్స్ కు ప్రభుత్వం అంగీకరిస్తే కానీ స్ట్రైక్ ను విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఆర్టీసీ స్ట్రైక్ కారణంగా ప్రైవేట్ బస్సుల చార్జీలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రజలు పండగకు తమ ఊర్లకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ 5000 ఆర్టీసీ బస్సులను ప్రయివేట్ చేసి నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక కొన్ని రోజుల క్రితం ప్రెస్ మీట్ లో ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి రాని పక్షంలో మిగితా బస్సులను కూడా ప్రైవేటీకరించడం ఖాయమని హెచ్చరించినప్పటికీ ఆ హెచ్చరికను బేఖాతరు చేసి ఈరోజు వరకు కారకులు నిధుల్లోకి రాని కారణంగా కేసీఆర్ నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు కేవలం 300 కార్మికులే విధుల్లోకి వచ్చినట్లు సమాచారం. ఆర్టీసీ విషయంలో కఠినంగా ఉంటే మొదటికే మోసం వస్తుందని భావించిన కేసీఆర్ న్యాయస్థానాల్లోనే ఈ సమస్యను పరిష్కరించేందుకు చూస్తున్నారని తెలుస్తుంది. నేడు ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ, మంత్రి పువ్వాడ అజయ్లతో సమావేశం ఏర్పాటు చేసి భవిశేత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.