
ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ లను తీర్చాలంటూ 42రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మె కారణంగా ఎంతోమంది సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ సమ్మె వంకతో ప్రైవేట్ బస్సులు చెలరేగిపోతున్నాయి. అయితే తమ డిమాండ్లలో నుంచి ఆర్టీసీ ఒకటి తొలగించిన విషయం తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ను పక్కన పెట్టారు కార్మికులు. ఈమేరకు మిగతా డిమాండ్లు నెరవేరెవరకు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు. ఇక నిన్న 42వ రోజుకు చేరుకున్న సమ్మెలో భాగంగా బైక్ ర్యాలీలు జరిపిన కార్మికులు...నేడు ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేయనున్నారు. దీనికి ప్రభుత్వం అంగీకరించకపోయినా... పోలీసులు బలవంతంగా తమను తలరించిన ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో దీక్షలు చేయాలన్న ప్లాన్ బీ కూడా కార్మికుల దగ్గర ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం మిగితా 25 డిమాండ్లపై చర్చించేందుకు తమను పిలుస్తుందని జేఏసీ భావిస్తుంది.