
ఆర్టీసీ గొడవ రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతుంది. తమకు న్యాయం చేయాలంటూ ఆర్టీసీ కార్మికులు నేడు మిలియన్ మార్చ్‌కు సిద్ధం అయినప్పటికీ పోలీసులు అడ్డు చెప్పడం... ఆర్టీసీ కార్మిక సంఘాలకు మద్దతు పలికిన కాంగ్రెస్, బీజేపీ కొంతమంది నేతలను హౌస్ అరెస్ట్ చేయటం... ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను అరెస్ట్ చేయటం లాంటి ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ ట్యాంకుబండ్ లోకి దూసుకోచ్చారు కార్మికులు. దీంతో పోలీసులకు లాఠీ ఛార్జ్ చేయటం తప్పలేదు. అయితే ఆర్టీసీ కార్మికుల దెబ్బకు కేసీఆర్ ఆత్మరక్షణలో పడ్డారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. నన్ను ఎదిరించి ఎలా ముందడుగేస్తారో చూస్తా అన్న ధోరణిలో కేసీఆర్ ఇప్పటి వరకు వ్యవహరించారు. కానీ కేంద్రం ఎదురు తిరిగేసరికి కేసీఆర్ గట్టి షాక్ కు గురయ్యినట్లు తెలుస్తోంది. అసలు మా దృష్టిలో తెలంగాణ ఆర్టీసే లేదంటూ కేంద్రం ఎదురు తిరిగేసరికి పునరాలోచించే పనిలో పడ్డారు. కేంద్రంను సముదాయించి ఆర్టీసీ గొడవకు తెరదించాలా ? లేదా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి ముగించాలా? లాంటి రకరకాల అంశాలపై కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు.