
ఆర్టీసీ గొడవ రోజు రోజుకు తారా స్థాయికి చేరుతుంది. కేసీఆర్ సర్కారు ఇచ్చిన గడువుల్లో కార్మికులు విధుల్లోకి రాని కారణంగా ఈ వ్యవహారం న్యాస్థానం చేతుల్లోకి వెళ్లింది. అయితే ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ ఎగ్గొటిందనీ ప్రభుత్వం ఆఫడవిట్ లో పేర్కొంది. ఇప్పుడు ఆర్టీసీ కట్టాల్సిన కార్మికుల పీఎఫ్ కట్టాలంటూ ఆర్టీసీ యాజమాన్యంకు నోటీసులు పంపారు. ఇది ఆర్టీసీ ఊహించని షాక్. ఇప్పటికే అప్పుల్లో మునిగిపోయిన ఆర్టీసీకి నెత్తి మీద మరో భారం పడినట్లే. ఈ నెల 15లోపు కార్మికుల పీఎఫ్ కు కట్టాల్సిన రూ.760.62 కోట్లను వెంటనే జమ చేయాలని ఆదేశించింది. ఈమేరకు ఆర్టీసీ ఎండీకి నోటీసులు పంపించింది. పీఎఫ్ డబ్బులు ఎగ్గొట్టినా, సమయానికి కట్టకపోయినా కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటుంది. అసలే అప్పుల్లో ఉన్న ఆర్టీసీ దీని నుంచి ఎలా గట్టెక్కుతుందో చూడాలి. మరోవైపు, ఆర్టీసీ కార్మికుల చేస్తున్న సమ్మెను మీడియాలో చూపకూడదని....సమ్మెను వీడియోలు తీయకూడదని పోలీసులు దౌర్జన్యానికి దిగుతున్నారు.