
ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘ కాలంగా తమ డిమాండ్స్ నెరవేర్చాలంటూ సమ్మె చేస్తున్న విషయం విదితమే. మొన్నీమధ్యే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయంలో ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గారు. మొదటి నుంచి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడంపై లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ వ్యతిరేకిస్తూ వచ్చారు. కానీ దాని విషయంలోనే కార్మికులు వెనక్కి తగ్గేసరికి...వారి మిగితా డిమాండ్స్ కు సానుకూలంగా స్పందించమని జేపీ కేసీఆర్ ను లేఖ ద్వారా కోరారు. ప్రైవేటు రంగంతో సమానంగా ఆర్టీసీని చూడాలనే కేసీఆర్ కోరికను జేపీ సమర్ధించారు. ఆర్టీసీ విలీనం విషయంలో కార్మికులు వెనక్కి తగ్గడం కేసీఆర్ వాదనలకు లభించిన విజయమని ఆయన అన్నారు. ఇందుకు కార్మికులను కూడా అభినందించాలని వ్యాఖ్యానించారు. కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని కోరిన జేపీ....ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోకూడదని కార్మికులకు విజ్ఞప్తి చేసారు.