
అక్కినేని నాగార్జున ఆరుపదుల వయసులో కుడా వరుసగా సినిమాలు చేస్తూనే మరో పక్క బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యేందుకు బిగ్ బాస్ హోస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఇకపోతే నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయనా సినిమా భారీ విజయాన్ని సాధించింది. విమర్శుకులు సైతం పొగడ్తల వర్షం కురిపించారు. అప్పటి వరకు నాగార్జునను మన్మధుడు అని పిలిచిన అభిమానులు బంగార్రాజు అని పిలవడం మొదలు పెట్టారంటే ఏ రేంజ్ లో సినిమా సక్సెస్ అయ్యిందో చెప్పొచ్చు. అందుకనే బంగార్రాజు టైటిల్ తో ఆ సినిమాకు సీక్వెల్ వస్తుందని...స్వయంగా తానే నిర్మిస్తానని నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రెండేళ్లుగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ అన్నపూర్ణ స్టూడియోస్ లో రైటర్స్ తో కధ కోసం చర్చలు జరిపాడు. అయితే ఈమధ్యలో వచ్చిన మన్మధుడు2 డిజాస్టర్ అవ్వడంతో సినిమాల ఎంపికపై చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు. అందుకే బంగార్రాజు సినిమాను పక్కకు పెట్టేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈనేపధ్యంలో రెండేళ్లుగా కళ్యాణ్ కృష్ణ మరో సినిమాను చేయకుండా చేసి...ఇప్పుడు ఇలా పక్కన పెట్టడం న్యాయమం కాదని సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.