ఆ సీన్స్ నా జీవితంలో చేయనంటున్న మిల్కీబ్యూటీ తమన్నా …విశాల్ తో ‘యాక్షన్’ మూవీ ..
4 years ago 1 min read

మిల్కీబ్యూటీ తమన్నా విశాల్ తో నటించిన 'యాక్షన్' మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఈ మేరకు ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న తమన్నా ముద్దు సీన్లపై తన నిర్ణయాన్ని తెలిపింది. ఈమధ్యకాలంలో ముద్దు సిన్లు సర్వసాధారణం అయ్యాయి. ఒకప్పుడు హాలీవుడ్లో ఉన్న ఈ సంస్కృతి బాలీవుడ్ కు పాకి...ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల్లోనూ సర్వసాధారణం అయింది. అయితే తమన్నా మాత్రం మొదటి నుంచి అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గలేదు కానీ ఆమె పెదాలను ముట్టుకునే అదృష్టం ఇప్పటి వరకు ఏ హీరోకు దక్కలేదు. ఈ విషయం గురించి తాజాగా ఆమె మాట్లాడుతూ....నాకు ఉన్న కట్టుబాటుల్లో అది ఒకటి. నేను ఇండస్ట్రీలో ఉన్నంత వరకు ముద్దు సిన్లకు దూరంగానే ఉంటానని మరోసారి స్పష్టం చేసింది. ఇకపోతే ఈ అమ్మడుకి టాలీవుడ్లో అవకాశాలు తగ్గిన తరుణంలో ఈ నిర్ణయం ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.