
ఏపీ రాష్ట్రంలో వర్షాలు బాగా పడి ఇసుక కొరత పెరిగింది. ఇసుక లేకపోవడంతో కార్మికులకు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనిపై ప్రతిపక్షాలు చేతకాని ఏపీ ప్రభుత్వం అంటూ చురకలు అంటిస్తున్నారు. దాంతో ఇసుక కొరతను సీరియస్ గా తీసుకున్న జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వారం రోజుల్లో ఈ పరిస్థితి మెరుగుపడిందన్నారు. 1.20లక్షలకు రోజువారి ఇసుక లభ్యత పెరిగిందన్నారు. ఇసుక కొరత పూర్తిగా పోయేవరకు అధికారులెవ్వరు సెలవులు తీసుకోవడానికి వీలులేదని హెచ్చరించారు. నవంబర్ 14 నుంచి నవంబర్ 21 వరకు ఇసుక వారోత్సవాలు జరగనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఇసుకను పక్క రాష్ట్రాలకు అక్రమంగా అమ్మినా....ఎక్కువ రేటుకు అమ్మినా రెండేళ్ల పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు రేపు ముఖ్యమైన నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.