
కరోనా మహమ్మారి కారణంగా ఇండస్ట్రీకి పెద్ద దెబ్బె పడిందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే, టాలీవుడ్ బిజీ నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు వెబ్ సిరీస్ బాట పడుతున్నారు. ఓటీటీ పుణ్యమా అంటూ లాక్ డౌన్ లో కూడా బిజీగా గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ జాబితాలో నిర్మాత అనిల్ సుంకర కూడా జాయిన్ అవుతున్నట్లు సమాచారం. 'షాడో' అనే వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇవ్వనున్నట్లు మొన్నీమధ్యే ఫస్ట్ లుక్ ద్వారా తెలిపారు. అయితే, ఈ నిర్మాత ఈ వెబ్ సిరీస్ కోసమై ఇద్దరు యంగ్ స్టర్స్ ని కలిసినట్లు తెలుస్తుంది. వాళ్లు ఎవరో కాదు....రానా దగ్గుబాటి, అల్లరి నరేష్. మరి ఈ ఇద్దరు ఓకే చెప్పి వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ లోకి అడుగు పెడతారా? లేదా కాదని వెండితెరకే మొగ్గుచూపుతారా? అనేది తెలియాల్సి ఉంది.