
భాగమతి సినిమా తర్వాత అనుష్క మరే సినిమాలోనూ కనిపించలేదు. త్వరగా సినిమా చేయటం కన్నా మంచి సినిమా చేయటం ముఖ్యం అనుకున్న స్వీటీ చాలా సైలెంట్ గా తన తదుపరి సినిమాపై వర్క్ చేసింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నిశ్శబ్దం' లో అనుష్క నటిస్తుంది. పేరుకు తగ్గట్లుగానే ఈ సినిమా గురించి ఏ వార్త లేకుండా సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అంచనాలను పెంచింది. చాలా గ్యాప్ తర్వాత అనుష్క సినిమా వస్తుండటంతో భారీ ఆసక్తి నెలకుంది. అయితే నవంబర్ 8న అనుష్క పుట్టినరోజు సందర్భంగా తాజాగా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ టీజర్ లో అనుష్క ఒక వెకేషన్ లో యాక్సిడెంట్ కు గురవుతుందని....అందరూ అనుమానితులేనని...అన్ని క్యారెక్టర్స్ రివీల్ చేశాడు డైరెక్టర్. ఇందులో అనుష్క డెఫ్ అండ్ డమ్ క్యారెక్టర్ చేస్తుంది. ఇలాంటి తరహా పాత్రలో అనుష్క ఎన్నడూ కనిపించకపోవడంతో అంచనాలు మరింత పెరిగాయి. త్వరలో రిలీజ్ కానుంది.