
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఎంతోమందికి స్ఫూర్తి. అంచెలంచెలుగా ఎదిగి ఈరోజున ఆయన వల్ల ఎంతోంది హీరోలుగా చెలామణి అవుతున్నారు. సినిమాపై చిరుకు ఉండే డెడికేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చిరు నటించిన తాజా సినిమా సైరా నర్సింహారెడ్డి మంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా... మెగాస్టార్ కష్టంకు అద్దం పట్టేలా ఉంది. సైరా ఇచ్చిన విజయంను ఎంజాయ్ చేస్తూ..తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. కొరటాల దర్శకత్వంలోలో చిరు 152వ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రెండు పాత్రల్లో చిరు కనిపించనున్నట్లు సమాచారం. యంగ్ గా కనిపించే పాత్ర కోసం చిరు అప్పుడే కసరత్తులు మొదలు పెట్టాడు. చిరు జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. కొరటాల తన హీరోల లుక్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడని ముందు సినిమాలు చూస్తే అర్థం అవుతుంది. అయితే చిరు వర్క్ ఔట్ ఫోటో చూసి కొంతమంది నెటిజన్లు...ఈ వయస్సులో మీరు పడుతున్న కష్టంకు హ్యాండ్స్ హాఫ్ అంటుంటే...మరికొంతమంది ఈ వయస్సులో మీకు అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.