
హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ) ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆదివారం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాసరెడ్డి లిఖితపూర్వకంగా రెండు ఫిర్యాదులు చేశారు. ‘టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కోదాడవాసి. అతనికి ఓటుహక్కు కోదాడలోనే ఉంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రచారం ముగిశాక స్థానికేతరులు ఎన్నిక జరిగే నియోజకవర్గ పరిధిలో ఉండకూడదు. కానీ, ఈ విషయంలో హుజూర్‌నగర్‌లోనే మకాం వేసిన ఉత్తమ్.. నిబంధనలను ఉల్లంఘించారని మొదటి ఫిర్యాదులో ఆరోపించారు.