
మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఫ్యామిలీను మ్యానేజ్ చేస్తూనే తన ప్రొఫెషనల్ లైఫ్ ను చూసుకుంటుంది. మెగా కోడలిగా పూర్తి బాధ్యతలు తీసుకోని కుటుంబంతో మమేకమైతుంది. అలానే కుటుంబంలో ఎటువంటి సందర్భం వచ్చినా హడావిడి అంతా ఉపాసనదే. సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయినా పెడుతుంటుంది. అంతేకాకుండా, అపోలో లైఫ్ చైర్మన్ గా తనదైన రీతిలో దూసుకుపోతుంది. హెల్త్ గురించి సలహాలు ఇస్తూ, ఆరోగ్యం పట్ల, వాతావరణం పట్ల అవగాహణ పెంచుతుంది. సెలెబ్రెటీలతో ఇంటర్వ్యూలు, డైట్ ప్లాన్లు ఇలా ఇదొకటి చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంటుంది. ఇప్పుడు తాజాగా నిరుద్యోగులకు ఉపాధి కలిపిస్తూ కంటెంట్ రైటర్స్ కావాలని ప్రకటన ఇచ్చింది. అంతేకాదు ఎడిటర్స్ కావాలని కూడా చెప్పింది. అంతేకాదు గతంలో హెల్త్ ఇష్యూస్‌కు సంబంధించిన ఏమైనా ఆర్టికల్స్ ఉండే తమ బయోడేటాతో పాటు అభిరుచులను హాబీలను పంపించమని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.