
చంద్రబాబుకు నిజంగా కష్ట కాలం మొదలైందేమో అనిపిస్తుంది. టీడీపీపై అసంతృప్తితో కొందరు, అధికారంలోకి లేని పార్టీలో ఉండి లాభమేముందనుకోని కొందరు పార్టీని విడుతున్నారు. పార్టీలోని పెద్ద తలకాయలు లేసిపోతుంటే ఉన్నకొద్ది బలహీనపడుతుంది. మొన్న వల్లభనేని వంశీ, అవినాష్, నరేంద్ర ఇలా ముఖ్య నేతలందరూ ఇప్పటికే రాజీనామా చేయగా.....తాజాగా కేఈ బ్రదర్స్ కూడా జంప్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నారు. కేఈ కృష్ణమూర్తి కర్నూల్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ సీఎంగా రెవెన్యూ, స్టాంప్స్-రిజిస్ట్రేషన్ శాఖల్లో తనదైన ముద్ర వేశారు. ఇక కేఈ ప్రతాప్ ఇరిగేషన్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా చేశారు. గత ఎన్నికల్లో ఈ ఇద్దరు పోటీ చేయలేదు. కానీ కేఈ కృష్ణమూర్తి స్థానంలో అతని కొడుకు శ్యామ్ కుమార్ పత్తికొండ నుంచి పోటీ చేసి ఒడిపియారు. ఇకపోతే కేఈ బ్రదర్స్ బాబుకు బై చెప్పి వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఈ నెల 29న జగన్ సమక్షంలో ఈ ఇద్దరు వైకాపాలో చేరుతున్నట్లు తెలుస్తోంది.