
ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ రష్మిక. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్గా నటిస్తున్న ఈ భామ, బాలీవుడ్ అరంగేట్రానికి సైతం సిద్ధమవుతోంది. అయితే తాజాగా ఈ కన్నడ బ్యూటీకి ఓ అగ్ర నిర్మాత షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.