
దర్శకుడు ప్రశాంత్ వర్మ తన మొదటి చిత్రం 'అ!' తో ఆకట్టుకున్నారు. రెండవ చిత్రం 'కల్కి' కూడా మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ యువ దర్శకుడు కరోనా వైరస్ పై సినిమా తీస్తున్నాడు. ఇది ఇప్పటికే 40 శాతం షూట్ పూర్తి చేసుకుంది. అయితే, తాజా వార్తల ప్రకారం ఈ యువ దర్శకుడు వెబ్ సిరీస్‌తో ఓటిటి ప్లాట్ఫామ్లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఓటిటి దిగ్గజం డిస్నీ హాట్‌స్టార్ లో తన వెబ్ సిరీస్‌ను రిలీజ్ చేయబోతున్నాడు. ఈ టాలెంటెడ్ దర్శకుడు ఈ వెబ్ సిరీస్ ను ఎలా, ఎంత కొత్తగా తీసాడో అనేది చూడాలి. సినిమా సినిమాకి కొత్తదనం చూపించే ఈ దర్శకుడు ఈసారి ఎలా తీస్తాడో అన్న ఆసక్తి అందరిలో నెలకుంది.