
కల్కి భగవాన్ ఆశ్రమాల్లో ఆదాయపన్ను శాఖ తనిఖీలు సోమవారంతో ముగిశాయి. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని రూ.800 కోట్ల ఆదాయాలను గుర్తించినట్లు సమాచారం. ఆఫ్రికా తదితర దేశాల్లో భారీ పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది. చెన్నై, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ఆశ్రమాలు, కల్కి భగవాన్ తనయుడు కృష్ణకు చెందిన సంస్థల్లో జరిపిన తనిఖీల్లో రూ.44 కోట్ల నగదు, రూ.20 కోట్ల విదేశీ కరెన్సీ, 90 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.