
సీఎం కేసీఆర్, ప్రధానమంత్రి మోదీ దోస్తులని, టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డితో కలసి నియోజవర్గంలోని పాలకీడు, నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్నగర్ మండలాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, కేసీఆర్ ముస్లింల వ్యతిరేకి అని, వారికి వ్యతిరేకంగా బీజేపీ పార్లమెంట్లో పెట్టే ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తున్నారని అన్నారు.