
విశాల్ ఆఫీస్ లోని లెక్కలు బొక్కలు ఒక్కసారిగా వెలుగులోకి వస్తున్నాయి. తమిళ్ ఇండస్ట్రీ యాక్షన్ హీరో అయిన హీరో విశాల్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సుపరిచితమే. విశాల్ కు 'విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ' పేరుతో చెన్నైలో ఒక నిర్మాణ సంస్థ ఉంది. అయితే, ఆ ఆఫీస్ లో అకౌంటెంట్ గా పని చేసిన రమ్యపై 45లక్షలు దొంగలించిందంటూ ఆరోపణలు వెలువడుతున్నాయి. విశాల్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ హరి కుమార్ ఆమెపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు. మరోపక్క తనని విశాల్ మరియు అతని సహచరులు బెదిరిస్తున్నారని రమ్య వాపోతుంది. వీటన్నిటికీతోడు సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు హరి కుమార్ కారును ధ్వంసం చేశారు. దీంతో విశాల్ మ్యానేజర్ ఈ దారుణం వెనుక రమ్య ఉందంటూ కేసు నమోదు చేశారు.