
రాజకీయాల్లో ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడం సర్వ సాధారణం. కాంగ్రెస్ పార్టీని జనం మర్చిపోతున్న సమయంలో ఏదోక కాంగ్రెస్ నేత వచ్చి ప్రతిపక్ష నేతలపై ఆరోపణలు, సెటైర్లు వేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని వర్గాల నుంచి మద్దతు ఉందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసినా.. చివరకు గెలిచేది కార్మికులేనని కితాబిచ్చారు. పీఆర్సీ పేరుతో మైండ్ గేమ్ ఆడుతున్నారని హెచ్చరించారు. ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటి కడుపు మండిపోయి ఉన్న ఆర్టీసీ కార్మికులు చలో ట్యాంక్ బండ్ సక్సెస్ చేశారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి యాక్షన్ ఎక్కువ...పని తక్కువాని ఎద్దేవా చేశారు. గోల్నాక ఫంక్షన్ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు రాకపోవడం బాధాకరమని అన్నారు.