
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగి నేటికి 34 రోజులు అయింది. కార్మికులకు నిన్నటి వరకు గడువు ఇచ్చింది కేసీఆర్ సర్కారు. అయినప్పటికీ హెచ్చరికను బేఖాతరు చేస్తూ కార్మికులు విధుల్లోకి రాని కారణంగా ఆర్టీసీ కార్మికులకు షాక్ ఇచ్చింది ప్రభుత్వం. తమ ఒక్కో అస్త్రాన్ని ప్రయోగిస్తూ వస్తుంది. మొన్నటి వరకు ఆర్టీసీకి ఎలాంటి అప్పులు లేవని చెప్పిన సర్కారు...ఇప్పుడు మోటారు వాహనాల పన్ను కింద ప్రభుత్వానికి ఆర్టీసీనే రూ.453 కోట్లు కట్టాలని అధికారులు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇది ఆర్టీసీకి పెద్ద ఝలక్ అని చెప్పక తప్పదు. ఇదిలావుండగా......రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ ను ఆర్టీసీ వాడుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమారు రూ.411 కోట్ల పెన్షన్ ను ఆర్టీసీ వాడుకుందని సమాచారం. ఆర్టీసీ చెలించాల్సిన అప్పులో తక్షణమే రూ.200 కోట్లు చెలించాలని ఆర్టీసీని హైకోర్టు ఆదేశించింది. మరి కార్మికులు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.