
14ఏళ్ల సీఎం అనుభవం ఉన్న చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన గత ఎన్నికల్లో ఘోరపరాజయం ఎదురైంది. దీంతో పార్టీలో వలసలు పెరిగిపోయాయి. ముఖ్యనేతలు పార్టీని విడటం బాబుకు ఆందోళన కలిగిస్తుంది. ఇదిలా ఉంటె పార్టీను వీడిన కొడాలి నాని, వల్లభనేని వంశీ బాబుపై చేస్తున్న విమర్శలు అంతా ఇంతా కాదు. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా యటాక్ చేస్తున్నారు. వాళ్ల విమర్శలపై స్పందిస్తూ నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఎమన్నా ఊరుకునేది లేదంటూ ధ్వజమెత్తారు. ఈరోజు మీరు ఇలా ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు అని మర్చిపోవద్దన్నారు. రాజకీయంగా ఏమైనా ఉంటే విమర్శించుకోండి కానీ వ్యక్తిగతంగా విమర్శిస్తే...ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఫైర్ అయ్యారు. ఆయనను నోటి కొచ్చినట్టు దూషిస్తే సహించేది లేదంటున్నారు.