
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ వచ్చే నెల 17న పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త సీజేఐ పేరును ప్రతిపాదిస్తూ ఆయన కేంద్రానికి లేఖ రాశారు. సీనియార్టీ ప్రకారం తన తర్వతి స్థానంలో ఉన్న శరద్ అరవింద్ బోబ్డే పేరును సుప్రీం కోర్టు కొత్త చీఫ్ జస్టిస్‌గా గొగోయ్ ప్రతిపాదించారు.