
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహ రెడ్డి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో చిరు ఫైట్స్ చూసి ఈ వయసులో కూడా ఇలా చేయడం మెగాస్టార్ కే సాధ్యమంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే బాడీ అలా ఫ్లెక్సిబుల్ ఉండేందుకు చిరు గట్టిగానే కష్టపడుతున్నారు. ఇక సైరా తర్వాత చిరు తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టాడు. కొరటాల శివ దర్శకత్వంలో చిరు 152వ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరు రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. అందులో ఒక పాత్ర కోసం బరువు తగ్గి ఫిట్ గా అయ్యేందుకు జిమ్ లో కసరత్తులు చేస్తున్న ఫోటో మొన్నీమధ్యే వైరల్ అయింది. అయితే ఫిట్ గా ఉండేందుకు కసరత్తులతో ఓటు డైట్ కూడా ముఖ్యమే. దానికోసం కోడలు ఉపాసన సలహాలు తీసుకుంటున్నాడట. ఉపాసన అపోలో లైఫ్ సంస్థ అధినేతగా ఉంటూనే...యూట్యూబ్ లో ఫిట్నెస్ గురించి, డైట్ ప్లాన్స్ గురించి వీడియోస్ పెడుతుంటుంది. ఆమెకు డైట్ ఎలా పాటిస్తే ఫిట్ గా ఉంటారో అనుభవం ఉంది కాబట్టే మెగాస్టార్ సైతం ఆమె సలహాలు తీసుకుంటున్నాడు.