
హైదరాబాద్ తెదేపా సీనియర్ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల అంత్యక్రియలను గుంటూరు జిల్లాలోని ఆయన స్వస్థలం నరసరావుపేటలో బుధవారం నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ నాయకుల సమక్షంలో అంత్యక్రియలు జరగనున్నాయి. కోడెల పార్థివ దేహాన్ని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి నకిరేకల్ చిట్యాల, కోదాడ, జగ్గయ్యపేట మీదుగా విజయవాడ..అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా మంగళగిరికి తరలిస్తారు. కార్యకర్తల సందర్శనార్థం భౌతికదేహాన్ని 2 గంటలపాటు గుంటూరు పార్టీ కార్యాలయంలోనే ఉంచనున్నారు. సాయంత్రం 4 గంటలకు గుంటూరు నుంచి కోడల పార్థివదేహాన్ని నరసరావుపేటకు తరలిస్తారు