
బాహుబలి లాంటి భారీ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. రాజమౌళి ఒక కారణం అయితే ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ ఉన్న టాప్ స్టార్స్ లో ఇద్దరు ఒకే తెరపై కనపడడం. నిజం చెప్పాలంటే ఈ సినిమాకు ఎటువంటి ప్రచారం కూడా అవసరం లేదు. రిలీజ్ అయ్యేవరకు అంత హాట్ టాపిక్ గా నిలుస్తుంది. అయితే ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో రామరాజు పాత్రలో ఉన్న చరణ్ ని బ్రిటీష్ వారి కోర్టులో హాజరు పరిచే సన్నివేశాలని రాజమౌళి చిత్రీకరిస్తున్నారు. దీని తర్వాత ఒక ఫోక్ సాంగ్ ను చిత్రికరిస్తారట...అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు డాన్స్ చేయనున్నారని తెలుస్తోంది. అందుకే ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతగా ఎదురుచూస్తున్నారు.