
సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉందొ అంతే నష్టం కూడా ఉంది. అందరికి అందుబాటులో ఉండటంతో ఎవరికి నచ్చినట్లు వారు పోస్టులు చేస్తుంటారు. ఆ పోస్టులు మెచ్చుకుంటూ, కించపరుస్తూ, అసభ్యకరంగా, మార్పు తెచ్చేలా ఎలాగైనా ఉండొచ్చు. తాజాగా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టులు పెడ్తున్నారంటూ హైకోర్టును ఆశ్చరయించారు. గన్నవరం పోలీసులకు ఎప్పుడో ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్లు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని..కేసును పక్కన పడేశారని ఆరోపించారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వంశీ పిటిషన్ ను విచారించిన కోర్టు తీర్పును రిజర్వ్ లో పెట్టింది. ఇకపోతే వల్లభనేని వంశీ పార్టీ విడతారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. మొన్నీమధ్యే బీజేపీ ఎంపీ సుజనాతో భేటి అయ్యారు. అలానే ఏపీ సీఎం జగన్ మోహన్ ను కలవటంతో ఈ ప్రచారంకు మరింత బలం చేకూరింది. నేను అసలు రాజకీయాల నుంచే తప్పుకుంటున్నాని వంశీ చెప్పడంతో పెద్ద షాక్ తగిలింది.