
సుదీర్ఘ బ్రేక్ తర్వాత ఒకేసారి రెండు సినిమాల చిత్రీకరణను ప్రారంభించిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా మహమ్మారి కారణంగా షూట్ కు బ్రేక్ ఇచ్చారు. అయితే ఆ రెండు సినిమాల్లో ఒకటి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిర్మాత ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న క్రిష్-పవన్ సినిమా టైటిల్ 'విరూపాక్ష' అంటూ రూమర్లు హల్చల్ చేశాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం కొత్తగా రెండు టైటిల్స్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. 'బందిపోటు', 'గజ దొంగ' అనే టైటిల్స్ ను ప్రస్తుతం యూనిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఏది ఫైనల్ చేస్తారో చూడాలి. ఇవి సీనియర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల టైటిల్స్ అవ్వటంతో అదే టైటిల్ పెడితే ఈ సినిమా కూడా ఆ రేంజ్ లో హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.