
విభిన్న కథలను ఎంచుకోవడంలో కోలీవుడ్ యాంగ్రీ హీరో కార్తీ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇప్పటివరకు అతడు తీసిన సినిమాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. చినబాబు, ఖాకీ వంటి సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కమర్షియల్ హిట్‌ను సాధించలేకపోయాయి. అనంతరం కమర్షియల్ హంగులతో వచ్చిన ‘దేవ్’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని తెలుగు సూపర్ హిట్ టైటిల్ ‘ఖైదీ’తో థియేటర్ తలుపులు తట్టాడు కార్తీ. ఖైదీ అనగానే తెలుగు ప్రేక్షకుల అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. మరి కార్తీ ఖైదీ ప్రేక్షకుల అంచనాలను అందుకున్నాయా? చాలా కాలం తర్వాత కార్తీ కమర్షియల్ హిట్ సాధించాడా? హీరోయిన్, కామెడీ, రొమాన్స్ లేకుండా ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారా? చూద్దాం.