
అల్లు కుటుంబానికి చెందిన గీతా ఆర్ట్స్ టాలీవుడ్లో అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటి. ఈ బ్యానర్లో పనిచేసే అవకాశం కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. దీనిని అవకాశంగా తీసుకొని, కొంతమంది నేరస్థులు గీతా ఆర్ట్స్ పేరును ఉపయోగిస్తూ చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుందని చెప్పి యువతులను, నటీమణులు కావాలనుకునే వారిని మోసం చేస్తున్నారు. ఈ నేరస్థులు గీతా ఆర్ట్స్‌లో తమను తాము డిజైనర్లుగా, మేకప్ మెన్లుగా చెప్పుకుంటూ అమ్మాయిలతో చాట్ చేసి వారిని ఒక ఉచ్చులోకి లాగుతున్నారు. ఇది తెలిసుకున్న గీతా ఆర్ట్స్ బృందం వెంటనే సైబర్ క్రైమ్‌లో కేసు నమోదు చేసింది.