
గోపిచాంద్ హీరోగా తెరకెక్కుతున్న 'అలివేలు వెంకటరమణ' సినిమాపై రకరకాల రూమర్లు పుట్టుకొస్తున్నాయి. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మొదట కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా అనుకున్నా తక్కువ రెమ్యునరేషన్ అఫర్ చేయటంతో ఆమె తిరస్కరించిందని వార్తొచ్చాయి. ఆ సమయంలో హీరోయిన్ గా అనుష్క, సాయి పల్లవి పేర్లు కూడా బలంగా వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం యాక్షన్ హీరో గోపీచంద్ సరసన నటి కాజల్ అగర్వాల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఈ పాత్రకు కాజల్ అయితేనే బాగుంటుందని భావించిన డైరెక్టర్ తేజ ఆమెను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది.