బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కళాకారులు ఫేమస్ అవుతున్న సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ పంచ్ డైలాగులతో కడుపుబ్బా నవ్వించడం జబర్దస్త్ కమెడియన్ల స్టైల్. ఈ బాటలోనే వెలుతూ బుల్లితెర ఆడియన్స్‌ని గిలిగింతలు పెట్టడమే గాక తమ కెరీర్‌కి సరికొత్త బాటలు వేసుకుంటున్నారు ఈ నయా జనరేషన్ కమెడియన్లు. ఇక ఇందులో గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ లాంటోళ్ళు బాగా సీనియర్లు. జడ్జ్ స్థానంలో నాగబాబు, రోజా కూడా అంతే.