
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినట్లు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి పెద్దగా హీరోలు రాలేదు. కృష్ణ తర్వాత కొడుకు మహేష్ వచ్చి ఇప్పుడు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా రానిస్తున్నాడు. ఇక చాలా కాలానికి మహేష్ ఫ్యామిలీ నుంచి కుర్ర హీరో లాంచ్ కాబోతున్నాడు. అతనే గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్. గల్లా అశోక్ మొదటి సినిమా లాంచ్ ను ఈ ఆదివారం ఘనంగా ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కు ఎంతోమంది సినీ ప్రముఖులు రానున్నారు. అయితే అతిధిగా మెగా హీరో రావటం విశేషం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పూజాకార్యక్రమాలతో మొదలుకానున్న ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే గల్లా జయదేవ్ కు రామ్ చరణ్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో గల్లా జయదేవ్ పిలవగానే చరణ్ సరే అన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా విషయానికి వస్తే ఎంతో కాలంగా పోస్ట్ ఫోన్ అవుతూ వస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించనుంది.