
టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపాలైన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ నేతలకు పార్టీపై ఆశలు లేక అధికారంలో ఉన్న పార్టీవైపు, బీజేపీవైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర వైకాపాకు జంప్ అవుతున్నారని సమాచారం. టీడీపీలో కీలకమైన పాత్ర పోషించిన నరేంద్ర అతి త్వరలో వైకాపా తీర్థం పుచ్చుకొనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇసుక కొరతతో ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్న అడపా రవి కుటుంబాన్ని పరామర్శించారు లోకేష్. అయితే ఎప్పుడు లోకేష్ వెంట తిరిగే నరేంద్ర ఈ పర్యటనకు రాకపోవడంతో పార్టీ మారుతున్నారనే ఊహాగానాలకు అజ్ఞ్యమ్ పోసినట్లైంది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజవర్గం నుంచి ఐదుసార్లు గెలిచిన నరేంద్ర గత ఎన్నికల్లో గెలిసి డబల్ హ్యాట్రిక్ సాధిస్తారని అనుకున్నారు కానీ ఈసారి పరాజయం ఎదురైంది. ఎన్నికల్లో ఓడిపోయిన మరుక్షణం నుంచి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. దాంతో నరేంద్ర కూడా బాబుకు హ్యాండ్ ఇస్తారా అనే చర్చ జరుగుతుంది.