
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి టీడీపీ నేతలు చెమటలు పట్టిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు పార్టీని విడీ వెళ్లిపోతున్నారు. కొన్ని రోజుల క్రితం టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే కేశినేని నాని పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. కొన్ని రోజుల్లో వైకాపా తీర్ధం పుచ్చుకొనున్నారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నేతలు పార్టీని విడుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని ఉమా రాజీనామా చేశారు. ఈ నెల 10న బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పుడు తాజాగా బాబుకు మరో షాక్ తగిలింది. టీడీపీ కీలక నేత గంటా శ్రీనివాసరావు పార్టీ మారేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. ఇదే కనుక నిజం అయితే చంద్రబాబుకు పెద్ద షాక్ తగిలినట్లే. గంటాతో సహా మరి కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. గంటా శ్రీనివాసరావు, సుజనా గురువారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ను కలిసి కీలక మంతనాలు జరిపారు.రెండు రోజుల పాటు ఢిల్లీలో మంతనాలు జరుపుతున్న గంటా ఏ క్షణమైనా బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశం ఉంది.