
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...నటుడు, మాజీ వైకాపా ఎంపీ అయిన మోహన్ బాబును కెలికి పెద్ద తప్పు చేసినట్లు ఉన్నారు. ఇంతకీ ఎం జరిగిందంటే... ఇటీవల జరిగిన ఓ సమావేశంలో చంద్రబాబు నోరు పారేసుకున్నారు. మోహన్ బాబు క్రమశిక్షణ లేని వ్యక్తి అంటూ కామెంట్ చేశారు. అసలే ఆయన్ను కెలికితే ఎవరిని వదిలిపెట్టని మోహన్ బాబు చంద్రబాబును కూడా వదల్లేదు. ఎలెక్షన్స్ పూర్తి అయ్యి...ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా తన గురించి ఇలా మాట్లాడడం తన మనసుకు బాధను కలిగించిందని స్పందించడమే కాకుండా... తన స్టైల్ లో బాబుపై ఫైర్ అయ్యారు. క్రమశిక్షణ, స్నేహం లాంటి పదాలకు అర్ధం తెలియని వారు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనని ఓ రేంజిలో ఏకిపారేశారు. అంతేకాదు తనతో పెట్టుకుంటే తడిసిపొద్దని కాసంత కటువైన పదాలతో ఫైర్ అయ్యారు. చంద్రబాబుపై మోహన్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.