
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంపాలైంది. కేవలం 23 సిట్లకే పరిమితమయ్యింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఇసుక దొరకడం సమస్యగా మారింది. ఇసుక లేకపోవడంతో కార్మికులకు ఉపాధి కలగటం లేదు. దీంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబుపై ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజా మండిపడ్డారు. ఎన్నికల్లో కేవలం 23 సీట్లే వచ్చిన కారణంగా చంద్రబాబు చిన్నమెదడు చితికిందని... అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ కరువు ఉంటుందని అందుకే అప్పుడు వర్షాలు పడలేదు. ఆ సమయంలో వచ్చిన ఇసుకను దోచుకున్నారని ఆరోపించారు. కానీ మా జగన్ ది చల్లటి పాదమని...అందుకే ఆయన రాకతో వర్షాలు బాగా పడ్డాయని...ఇసుక అందించటం కొంచెం లెట్ అయితే పెద్ద రాదంతం చేస్తున్నారని మండిపడ్డారు.